IPTO Complex: ఐఈసీసీ కోసం నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్?
తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో హవన్ పూజ నిర్వహించారు. ఢిల్లీలోని రీ డెవలప్ చేసిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్‌ల
- By Anshu Published Date - 03:07 PM, Wed - 26 July 23

తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో హవన్ పూజ నిర్వహించారు. ఢిల్లీలోని రీ డెవలప్ చేసిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్‌లో ఈ పూజ కార్యక్రమాలు జరిగాయి. కాగా తాజాగా బుధవారం ప్రగతి మైదాన్‌లో అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ ఈ ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఈ అద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను సత్కరించారు. అనంతరం వారితో సంభాషించారు. దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2700 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
అలాగే నేడు సాయంత్రం 6:30 గంటలకు జరిగే భారీ ప్రారంభోత్సవ వేడుక కోసం ఆయన తిరిగి ఐటీపీఓ కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జీ20 స్టాంప్, నాణేలను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. తాజాగా పునరుద్దరించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్ ను అధికారికంగా ప్రారంభించి ఆ తర్వాత ప్రసంగించనున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, యాంఫీథియేటర్ లతో పాటు బహుళ అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉందనీ, సమావేశాలను నిర్వహించడానికి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలనే మోదీ దృష్టికి అనుగుణంగా ఈ సెంటర్ రూపుదిద్దుకుందని పీఎంవో ప్రకటించింది. ఐటీపీఓ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తున్న ఈ కాంప్లక్స్‌లో పెద్ద ఎత్తున ఈవెంట్‌లు, ట్రేడ్ ఫెయిర్‌లు, కాన్ఫరెన్స్‌లు ఎగ్జిబిషన్‌లకు వేదిక కానుంది.
VIDEO | PM Modi performs Hawan Pujan at the inauguration ceremony of the redeveloped India Trade Promotion Organisation (ITPO) complex in Delhi, which will host the G20 leaders’ meeting in September.
(Source: Third Party) pic.twitter.com/Qkp5KWb07o
— Press Trust of India (@PTI_News) July 26, 2023
ఈ భవన సముదాయం ఇండియా పారిశ్రామిక వృద్ధి, వాణిజ్యం, సాంస్కృతిక పరస్పర మార్పిడిని ప్రోత్సహించడంలో కీలకంగా మారనుంది. అలాగే సెప్టెంబరులో జీ 20 నేతల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్కిటెక్ట్ రాజ్ రేవాల్ రూపొందించిన, దేశానికి స్వాతంత్ర్యం పొందిన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మించిన హాల్ ఆఫ్ నేషన్స్‌తో సహా ఇప్పటికే ఉన్న అనేక ఎగ్జిబిషన్ హాల్స్ కూల్చివేయబడిన తర్వాత 2017లో పునరాభివృద్ధికి సంబంధించిన పని ప్రారంభమైంది. వసుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద ఎంఐసీఐ కీలక వేదిక. కాగా ఇది ఆస్ట్రేలియాలోని ఐకానిక్ సిడ్నీ ఒపెరా హౌస్‌లో సీటింగ్ సామర్థ్యం 5500 కంటేమించి కన్వెన్షన్ సెంటర్ లెవల్ 3 వద్ద 7,000 సీటింగ్ సామర్థ్యంతో ఇది నిర్మాణమైంది.