HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Modi Focuses On Jammu And Kashmir Visiting Today

PM Modi: జమ్మూకాశ్మీర్ పై మోడీ పాగా

ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లో ఆదివారం పర్యటించనున్నారు.

  • By CS Rao Published Date - 09:10 AM, Sun - 24 April 22
  • daily-hunt
Pm Modi
Pm Modi

ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లో ఆదివారం పర్యటించనున్నారు. రాష్ట్ర హోదా తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధిపతి కుల్‌దీప్‌ సింగ్‌ శనివారం సుంజ్వాన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి వెళ్లి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు. సాయంత్రం మోదీ కశ్మీర్‌ నుంచి నేరుగా ముంబయికు చేరుకుంటారు. అక్కడ లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మాస్టర్‌ దీనానాధ్‌ మంగేష్కర్‌ అవార్డును అందుకుంటారు. జమ్ము కాశ్మీర్ లో ప్రధాని ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు? ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలి సారి మోడీ అక్కడ రూ.7,500 కోట్లతో నిర్మించనున్న దిల్లీ-అమృతసర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారితో పాటు, చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులనూ ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సుంజ్వాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే-మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లీ గ్రామం నుంచే గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
ప్రధాని మోదీ జమ్ము కాశ్మీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని జమ్ము కాశ్మీర్ పర్యటన చేస్తున్నారు. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ‘జాతీయ పంచాయతీ రాజ్‌’ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంను ప్రధాని ప్రారంభిస్తారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రధాని మోదీ ప్రత్యేకంగా…
ఇప్పటికే అక్కడ 20 సార్లు పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 2019 ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. రాష్ట్ర హోదాను తొలగించి జమ్ము కశ్మీర్, లడక్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. 2019, 2021లో జమ్ముకశ్మీర్ కు వెళ్లినా సరిహద్దుల్లో సైనిక బలగాలతో దీపావళి నిర్వహించుకునేందుకే పరిమితమయ్యారు. ఈసారి మాత్రం స్థానికంగా పర్యటించనున్నారు. కశ్మీర్‌ పర్యటనలో మోదీ రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ రహదారిని ప్రారంభించనున్నారు. మొత్తం మీద మోడీ పర్యటన సర్వత్రా ఆసక్తి గా ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jammu and Kashmir
  • pm modi
  • security

Related News

Nitish Kumar

Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!

నవంబర్ 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏకు చెందిన ఇతర ప్రముఖ నాయకులు పాల్గొంటారు.

  • Nitish Kumar

    Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!

  • Aishwaryarai

    Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!

  • Chandrababu

    Chandrababu: రాజ్యాంగం వల్లే సామాన్యుడు అత్యున్నత పదవికి: సీఎం చంద్రబాబు

  • PM Kisan

    PM Kisan: శుభ‌వార్త‌.. ఆరోజు ఖాతాల్లోకి రూ. 2 వేలు!?

Latest News

  • AUS vs ENG : యాషెస్ తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఆలౌట్..!

  • ByPoll : మళ్లీ నేనే గెలుస్తా – కడియం ధీమా

  • Samantha Fitness : సమంత ఫిట్ నెస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!

  • Satyasai : సత్యసాయి సమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి

  • Grama Panchayat Election : ఏపీలో మళ్లీ ఎన్నికల జాతర

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd