HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Moves To Increase Lok Sabha Seats To 850

లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

అప్నా దళ్ (ఎస్) ఎంపీ అనుప్రియా పటేల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఈ మూడు బిల్లులకు తన మద్దతు ప్రకటించారు.

  • Author : Gopi Date : 17-04-2026 - 3:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lok Sabha Seats
Lok Sabha Seats

Lok Sabha Seats: మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి, లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. 16 ఏప్రిల్ 2026న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ బిల్లులను లోక్‌సభలో చర్చకు తీసుకువచ్చారు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దీనితో పాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచే ప్రతిపాదనను కూడా ఉంచారు.

ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మూడు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టింది.

  • రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026
  • నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు 2026
  • కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2026

Also Read: Indonesia Helicopter Crash: ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది మృతి

ఈ బిల్లుల ద్వారా పార్లమెంట్, రాష్ట్రాల సీట్ల పునఃపంపిణీ జరుగుతుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మార్గం సుగమం అవుతుంది. దీని కోసం జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ బిల్లులను ఆమోదించడం ప్రభుత్వానికి అంత సులభంగా కనిపించడం లేదు. విపక్ష వర్గాల సమాచారం ప్రకారం.. ఈ బిల్లులు నెగ్గాలంటే కనీసం 345 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద దాదాపు 302 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉందని, అందువల్ల ప్రస్తుత స్థితిలో ఈ బిల్లులు పాస్ అవ్వడం కష్టమని విపక్షాలు వాదిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో ఈ అంశంపై భారీ రాజకీయ ఘర్షణ చోటుచేసుకునే అవకాశం ఉంది.

మూడు బిల్లులకు అనుప్రియా పటేల్ మద్దతు

అప్నా దళ్ (ఎస్) ఎంపీ అనుప్రియా పటేల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఈ మూడు బిల్లులకు తన మద్దతు ప్రకటించారు. లోక్‌సభలో మహిళల భాగస్వామ్యం ఇంకా చాలా తక్కువగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సభలో కేవలం 14 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, ఈ నిరాశాజనక స్థితి మారాలని ఆమె అన్నారు. ఈ కొత్త బిల్లుల ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.

లోక్‌సభ సీట్ల సంఖ్య పెరగడం వల్ల అటు చిన్న పార్టీలకు, ఇటు పెద్ద పార్టీలకు మేలు జరుగుతుందని అనుప్రియా పటేల్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో విపక్షాలపై ఆమె విమర్శలు గుప్పించారు. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు 543 సీట్లలోనే 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ రోజు కుల గణన గురించి మాట్లాడుతున్న వారు తమ హయాంలో దీనిపై ఎందుకు గట్టి చర్యలు తీసుకోలేదని నిలదీశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 850 Seats Proposal
  • Delimitation 2026
  • Lok Sabha Seat Expansion
  • Lok Sabha seats
  • pm modi
  • Women's Reservation Bill 2026

Related News

PM Modi

PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లు ఆపేయాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని కోరారు. అయితే, ప్రధాని మోదీ సూచనతో దేశ ప్రజలు ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను ఆపేస్తే మన ఆర్థిక వ్యవస్థకు ఎలా మేలు చేస్తుంది? ప్రస్తుతం దేశంలో విదేశీ మారక నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్ప

  • Modi Urges No Gold Purchase

    Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

Latest News

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd