Fuel Price: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం విడుదల చేశాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
- By Praveen Aluthuru Published Date - 08:05 AM, Mon - 15 May 23

Fuel Price: పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం విడుదల చేశాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మెట్రో నగరాల్లోనూ ధరలు అలాగే ఉన్నాయి. గత ఏడాది కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 గా కొనసాగుతుంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 కాగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.27.
ఇతర నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.108.08, డీజిల్ రూ.93.36
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.107.80, డీజిల్ రూ.94.56
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76
చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
నోయిడా: లీటర్ పెట్రోల్ రూ.96.53, డీజిల్ రూ.89.71
గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ.97.10, డీజిల్ రూ.89.96
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82గా ఉంది.
Read More: CSK vs KKR: చెన్నై కొంపముంచిన ఆ ఇద్దరు