HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pawan Kalyan Blamed The Government For The Problems Of Farmers In The State

Pawan Kalyan: రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదు….ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం రాదా? – ‘పవన్ కళ్యాణ్’

రాష్ట్ర పాలకులకు వ్యవసాయ రంగం మీదా.. రైతుల సంక్షేమం మీదా శ్రద్ధ లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ప్రాంతంలో చూసినా రైతులు, కౌలు రైతులు నష్టాల పాలై మానసిక స్థయిర్యం కోల్పోయి ఉన్నారు.

  • Author : Hashtag U Date : 29-04-2022 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pawan kalyan
pawan kalyan

రాష్ట్ర పాలకులకు వ్యవసాయ రంగం మీదా.. రైతుల సంక్షేమం మీదా శ్రద్ధ లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ప్రాంతంలో చూసినా రైతులు, కౌలు రైతులు నష్టాల పాలై మానసిక స్థయిర్యం కోల్పోయి ఉన్నారు. వారి కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఆ బాధ్యతను విస్మరించారు. రైతుల క్షోభ ఏ స్థాయిలో ఉందో పాలకులకు అర్థం కాకపోవడం విచారకరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సాగు నష్టాలు, అప్పుల భారంతో కుంగిపోయి అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన రైతు జయరామిరెడ్డి, నంద్యాల జిల్లా తాటిపాడుకి చెందిన కౌలు రైతు, ఆ గ్రామ ఎంపీటీసీ చిన్న శంకర్, ఎన్టీఆర్ జిల్లా జయంతికి చెందిన ఇప్పల శ్రీనివాసరెడ్డి బలవన్మరణం చెందారని నా దృష్టికి వచ్చింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
వైసీపీ పాలన మొదలయ్యాక సుమారు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రైతు ఆత్మహత్య గురించి వింటూనే ఉన్నాం. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాలకుల్లో చలనం రాకపోవడం గర్హనీయం. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోయినా జనసేన అండగా నిలుస్తుంది. కౌలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణ అర్హత కార్డులు దక్కేలా పోరాడుతుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh farmers
  • AP government
  • farmers
  • Pawan Kalyan

Related News

Msme Summit 2026

AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ర

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd