HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pan India Star Pushpa Arrest Cm Revanth Reddy Leadership Praised By Mp Chamala

Chamala Kiran Kumar : అల్లు అర్జున్ అరెస్ట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారు

Chamala Kiran Kumar : సీఎం రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి చేసి అందరికీ తెలిస్తే... సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిశారని అన్నారు.

  • Author : Kavya Krishna Date : 02-01-2025 - 5:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MP Chamala
MP Chamala

Chamala Kiran Kumar : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా నాయకుడిగా ఎదిగారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుష్ప (అల్లు అర్జున్) అరెస్ట్ చేసిన సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి చేసి పేరుపొందితే, రేవంత్ మాత్రం ప్రజల కోసం సాహసోపేత చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలువిధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కేటీఆర్ నిర్దోషిగా తేలాలని కోరుకుంటున్నప్పటికీ, ఆయన తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు కేటీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని చామల హెచ్చరించారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు అంశంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రాజెక్టు ఖర్చును అనవసరంగా పెంచి అవినీతికి తావిచ్చారని చామల విమర్శించారు. రూ. 7,000 కోట్ల ప్రాజెక్టును రూ. 12,000 కోట్లకు పెంచారని, ఇందులో రూ. 5,000 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ వివరించారని తెలిపారు.

Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాధ్యతలను విస్మరించి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. “2025 నాటికి అయినా బీఆర్ఎస్ నేతలకు జ్ఞానోదయం కలగాలని ఆశిస్తున్నాం,” అని చామల ఎద్దేవా చేశారు.

రైతు భరోసా పథకం కింద అనర్హులకు రూ. 22,000 కోట్లు పంపిణీ చేశారని, దీనివల్ల నిజమైన రైతులు నష్టపోయారని చామల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతుల సంక్షేమాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, తనకు సంబంధం లేదని ఒక రోజు చెబుతారో, మరుసటి రోజు అన్ని బాధ్యతలు తనపైనే ఉన్నట్లు ప్రకటిస్తారో అని విమర్శించారు.

Local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS criticism
  • Corruption allegations
  • Farmers' Welfare
  • KTR Formula E Case
  • MP Chamala Kiran Kumar Reddy
  • Pushpa Arrest
  • revanth reddy
  • RRR Project
  • telangana
  • telangana politics

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd