HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Palle Panduga Program Start On 14 October Says Ap Deputy Cm Pawan Kalyan

Pawan Kalyan : 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’: డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan Kalyan : 3000 కి.మీ. మేర సీసీ రోడ్లు, 500 కి.మీ. మేర తారు రోడ్లు వేయాలన్నారు. ఆగస్టు 23న ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ ద్వారా ప్రారంభించాలన్నారు.

  • By Latha Suma Published Date - 06:14 PM, Tue - 8 October 24
  • daily-hunt
palle panduga program start on 14 october says ap deputy cm pawan kalyan
palle panduga program start on 14 october says ap deputy cm pawan kalyan

Palle Panduga program: ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని సూచించారు. 3000 కి.మీ. మేర సీసీ రోడ్లు, 500 కి.మీ. మేర తారు రోడ్లు వేయాలన్నారు.

Read Also: Tank Bund : 10న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు: CS శాంతి కుమారి

ఆగస్టు 23న ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ ద్వారా ప్రారంభించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు, డిపిఓ లు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర అధికారులకి దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగలో అధికారులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల మనం గ్రామ సభలు నిర్వహించుకున్నాం. ఆ కార్యక్రమంలో కొన్ని పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా పల్లె పండుగ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ 14 నుంచి దాదాపు వారం రోజులపాటు పల్లె పండుగ మనం నిర్వహిస్తున్నాము. ఆగస్టులో జరిగిన గ్రామసభల్లో తీసుకున్న దరఖాస్తుల పరిష్కారానికి, తీర్మానాలను అమలుకు దాదాపు 4500 కోట్ల వ్యయంతో 30 వేల పనులకు పల్లె పండుగ ద్వారా శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాలతో పనులు మొదలుపెట్టాలి. ఈ కార్యక్రమంలో భాగంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయాలి. మరో 500 కిలోమీటర్ల మేర తారు రోడ్లు వేయాలి. ఇంకుడు గుంతల నిర్మాణాలు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు లాంటి పనులు చేపట్టాలని’ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు వివరించారు.

Read Also: Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Deputy CM Pawan Kalyan
  • grama sabhalu
  • Palle Panduga program
  • Upadi hami pathakam

Related News

sai durga tej

Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి ద

  • Cbn Google

    Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

  • Group-1 Candidates

    Bankacherla Project : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • Deputy CM Pawan Kalyan

    Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Fake Alcohol

    Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు

Latest News

  • Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు

  • CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

  • Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

  • Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

Trending News

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd