BJLP : ఇక మారేది తెలంగాణ ముఖ్యమంత్రే : మహేశ్వర్ రెడ్డి కీలకవ్యాఖ్యలు
మిషన్ చేంజ్ టాస్క్‌పైనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసీసీ ఇన్‌చార్జిగా వచ్చారని అన్నారు. డిసెంబర్ నెలలోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారు.
- By Latha Suma Published Date - 08:29 PM, Mon - 3 March 25

BJLP : బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మారారంటే.. ఇక మారేది ముఖ్యమంత్రేనని అన్నారు. రాహుల్ గాంధీ టీమ్ నుంచి కొత్త ఇంఛార్జిని పెట్టారన్నారు. మిషన్ చేంజ్ టాస్క్‌పైనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసీసీ ఇన్‌చార్జిగా వచ్చారని అన్నారు. డిసెంబర్ నెలలోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం పీఠంపై భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారని కీలక ఆరోపణలు మహేశ్వర్ రెడ్డి చేశారు.
Read Also: Begumpet Airport Reopen : త్వరలోనే బేగంపేట ఎయిర్‌పోర్టు రీఓపెన్..?
కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాడి తప్పింది. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఒక్క మంత్రి కూడా సీఎంని ఖాతరు చేయడంలేదు అని వ్యాఖ్యానించారు. ఇక, వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకు ముఖ్యమని మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రుల పనితీరులోనూ చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఎవరికీ శాఖల మీద అవగాహన లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకే కింద నెగిటివ్ అయ్యేలా మంత్రులు బిహేవ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏం జరిగేది ఎవరికీ తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలను గంగలో కలిపారని ఆరోపించారు. రైతులను సైతం వేధిస్తున్నారని అన్నారు. మంత్రుల పనితీరులోనూ చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఎవరికీ శాఖల మీద అవగాహన లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేరని అన్నారు. కాగా, ఇటీవల మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.