Sakshi Malik: రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పిన ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడు సంజయ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 స్థానాల్లో 13 స్థానాల్లో విజయం సాధించి కొత్త డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 21-12-2023 - 6:16 IST
Published By : Hashtagu Telugu Desk
Sakshi Malik: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడు సంజయ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 స్థానాల్లో 13 స్థానాల్లో విజయం సాధించి కొత్త డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో అత్యున్నత పదవి చేపట్టడాన్ని నిరసిస్తూ రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించారు.
ఎన్నికలకు ముందు బ్రిజ్ భూషణ్‌తో సంబంధం ఉన్న వారిని డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న రెజ్లర్లు బజరంగ్ పునియా మరియు సాక్షి క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను పదే పదే అభ్యర్థించారు. బ్రిజ్ భూషణ్ విధేయులు ఎవరూ డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో పోటీ చేయరన్న మాటపై ప్రభుత్వం నిలబడకపోవడం దురదృష్టకరమన్నారు రెజ్లర్ బజరంగ్.
Also Read: Cauliflower Tomato Palakura: కాలీఫ్లవర్ టమాటా పాలకూర కర్రీ.. సింపుల్ గా ట్రై చేయండిలా?