Hyderabad: మలక్‌పేట డ్రైనేజీలో ఆయిల్.. అదుపుతప్పుతున్న వెహికిల్స్
మలక్‌పేట రోడ్డు డ్రైనేజిలో ఇంజిన్ ఆయిల్ కలిసి వర్షానికి డ్రైనేజి పొంగిపొర్లడంతో ఆ మార్గాన ప్రయాణిస్తున్న కొందరు ప్రమాదానికి గురయ్యారు
- Author : Praveen Aluthuru
Date : 11-07-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: మలక్‌పేట రోడ్డు డ్రైనేజిలో ఇంజిన్ ఆయిల్ కలిసి వర్షానికి డ్రైనేజి పొంగిపొర్లడంతో ఆ మార్గాన ప్రయాణిస్తున్న కొందరు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఆయిల్ ఉన్న కారణంగా పలు వాహనాలు అదుపుతప్పి జారి పడ్డాయి. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయపడ్డారు. అందులో మహిళలు కూడా ఉన్నారు.
మలక్‌పేట-చాదర్‌ఘాట్ రోడ్డు మార్గంలో మెకానిక్‌లు తమ వద్ద ఉన్న అవసరం లేని ఇంజిన్ ఆయిల్ ను డ్రైనేజి గుంతలో పడవేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షాలు పడుతుండటంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీరు గుండా ఇంజిన్ ఆయిల్ బయటకు వస్తున్నది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం సాయంత్రం ఆ మార్గంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు వాహనాలపై నుంచి జారి కిందపడ్డారు. మహిళలు సహా కనీసం పది మంది గాయపడ్డారు.
ప్రమాదానికి కారణం రోడ్డుపై ఇంజిన్ ఆయిల్ అని గమనించిన ట్రాఫిక్ పోలీసులు మరియు బల్దియా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ప్రమాదాలు జరగకుండా మట్టి బస్తాలను రోడ్డుపై పరిచారు. దీంతో మలక్‌పేట-చాదర్‌ఘాట్ రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అదనపు ట్రాఫిక్ పోలీసులను నియమించారు.
Read More: IPL Band Value: బ్రాండ్ వాల్యూలో ఐపీఎల్ సరికొత్త రికార్డ్… మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఏదో తెలుసా ?