AP News : ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
AP News : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల , ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీద ఉన్న ఈ మెడికల్ కళాశాలలో మొత్తం 122 ఖాళీలను కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ పద్ధతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
- By Kavya Krishna Published Date - 01:59 PM, Mon - 2 June 25

AP News : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల , ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీద ఉన్న ఈ మెడికల్ కళాశాలలో మొత్తం 122 ఖాళీలను కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ పద్ధతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, మెడికల్ కళాశాలలో 35 పోస్టులు , ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://eluru.ap.gov.in/notice_category/recruitment/ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్‌లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం..!
దరఖాస్తు ప్రక్రియ జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. చివరి తేదీ జూన్ 16గా నిర్ణయించబడింది. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన ఆధారపత్రాలతో పాటు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయానికి పంపించాలి. ఈ నియామక ప్రక్రియలో పాల్గొనదలచిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు అనుగుణంగా టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్/బీఈ, డీఎంఎల్టీ, ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి. కొందరు పోస్టులకు అనుభవం కూడా అవసరం. అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 42 ఏళ్లలోపు ఉండాలి.
CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం
జీతం పోస్ట్ ఆధారంగా నెలకు రూ.15,000 నుంచి రూ.54,060 వరకు చెల్లించనున్నారు. దరఖాస్తు ఫీజు విషయంలో ఓసీ అభ్యర్థులకు రూ.250 వసూలు చేయనుండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మాఫీ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందే అవకాశం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.