HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >National Media Visit Telangana Projects

Telangana Projects: తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ మీడియా ఫిదా

  • Author : Balu J Date : 15-04-2023 - 5:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Media
Media

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన వివిధ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనతి కాలంలోనే అత్యద్భుతమైన సాగునీటి రిజర్వాయర్లు నిర్మించడంపై సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు జర్నలిస్టులు కితాబిచ్చారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ను మీడియా ప్రతినిధులు సందర్శించారు.

మల్లన్న సాగర్ పంప్‌హౌస్‌ ద్వారా వందల కిలోమీటర్ల దూరం నుంచి అంత ఎత్తుకు గోదావరి నీళ్లను తెచ్చి నిలువ చేయడంపై మీడియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తక్కు వ సమయంలో క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల గురించి ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతం మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల రైతులతో మీడియా ప్రతినిధులు మాట్లాడి, మల్లన్న సాగర్ నిర్మాణ అనంతరం అన్నదాతలకు జరిగిన మేలు గురించి తెలుసుకున్నారు.

గజ్వేల్ లోని కోమటిబండలో మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించిన జర్నలిస్టులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు విజయంతంగా అందిస్తున్న తీరును పరిశీలించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనేకసార్లు ప్రశంసించిన విధానాన్ని గుర్తు చేసిన మీడియా ప్రతినిధులు, మిషన్ భగీరథ పథకాన్ని దేశమంతా అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం గజ్వేల్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను జర్నలిస్టులు సందర్శించారు. స్వచ్ఛమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాల నడుమ నాణ్యమైన, శుభ్రమైన కూరగాయలు, మాంసం, పండ్లు, పువ్వులు.. ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు ఒకే చోట విక్రయించే విధంగా మార్కెట్ లో సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు, ఇలాంటి మార్కెట్ల ద్వారా వ్యాపారులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం పంప్ హౌస్ లను సందర్శించారు.

కాళేశ్వరం లాంటి అతి భారీ లిఫ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేసి రైతులకు నీళ్లందించిన తెలంగాణ ప్రభుత్వాన్ని మీడియా ప్రతినిధులు కొనియాడారు. ఛీఫ్ ఇంజనీర్ హరిరాం ను అడిగి ప్రాజెక్టు కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ గారి ప్రణాళికలు, సాగునీటి నైపుణ్యాలను ఆసక్తిగా తెలుసుకున్నారు పలువురు జర్నలిస్టులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్న పదానికి ప్రత్యక్ష నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అని మీడియా ప్రతినిధులు చర్చించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశమంతటా అమలుచేస్తే అభివృద్ధి, సంక్షేమంలో దేశం ముందడుగు వేయడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడతాయని మీడియా ప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు, ఈశాన్య రాష్ట్రాల జర్నలిస్టులు, పలు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలకు చెందిన రిపోర్టర్లు పలు ప్రాజెక్టులను సందర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • national media
  • projects
  • telangana
  • water

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd