HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nara Lokesh Delhi Tour 2

Delhi : ఏపీలో జరిగే అరాచకాలను ఢిల్లీ నేషనల్ మీడియాలో బయటపెట్టిన నారా లోకేష్

అక్రమ కేసులో తన తండ్రి చంద్రబాబు ను అరెస్ట్ చేసారని..రాష్ట్రంలో నిజాయితీ పరులను జైలుకు పంపిస్తున్నారని

  • Author : Sudheer Date : 16-09-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh
Police Case Filed on Nara Lokesh at Nallajarla Police Station with YCP Leaders Complaint

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ , జనసేన పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. మరోపక్క ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో…. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలోని పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించాలని లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీకి వెళ్లడం జరిగింది.

ప్రస్తుతం అక్కడి మీడియా తో మాట్లాడిన లోకేష్..వైసీపీ సర్కార్ (YCP Govt) నీచ రాజకీయాల గురించి దేశ మొత్తం మాట్లాడుకోవాలని ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అక్రమ కేసులో తన తండ్రి చంద్రబాబు ను అరెస్ట్ చేసారని..రాష్ట్రంలో నిజాయితీ పరులను జైలుకు పంపిస్తున్నారని..అక్రమంగా చంద్రబాబు ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారని..చంద్రబాబు కు జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ నేతలంతా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారని లోకేష్ చెప్పుకొచ్చారు.

స్కిల్ డెవలప్ కేసులో ఇక్కడకూడా నగదు చేతులు మారినట్లు నిరూపించలేకపోయారని, ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే చంద్రబాబు ఫై కేసులు పెట్టిందని లోకేష్ మండిపడ్డారు.స్కామ్ జరగలేదని నిరూపించే విలువైన పత్రాలు తనదగ్గర ఉన్నాయని లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు బాగుండాలని జనసేన – టీడీపీ కలిసి పనిచేయబోతున్నాయని లోకేష్ ఈ సందర్బంగా తెలిపారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఏమైనా విదించారా..? అని ప్రశ్నించారు. తమ అధినేత చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని, ఆయన దేనికీ భయపడరని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా సీఎం జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారన్నారు.

సైబర్‌ టవర్స్‌ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశారు. ఆధారాలు లేకుండా స్కామ్‌ జరిగిందని ఇప్పుడు ఆయనపై కేసు పెట్టారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్‌ వార్‌ మొదలుపెట్టాలి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాటం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. జగన్‌ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని” అన్నారు.

ఏపీలో అవినీతి పరులైన పాల‌కులు, నీతిపరులను జైలుకు పంపుతున్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి స్కామ్ జరగలేదు. ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించింది. #IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/yFxkIAAMwI

— Lokesh Nara (@naralokesh) September 15, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Arrest
  • nara lokesh
  • Nara Lokesh Delhi Tour

Related News

Nagababu praises Lokesh response on the Mylavaram incident

Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు

తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతాయుతమైన నాయకత్వం ఎదుగుతోందని, అందుకు లోకేశ్ ప్రవర్తనే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

Latest News

  • Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

  • Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

  • US-Iran : ఇరాన్‌పై అమెరికా కఠిన వైఖరి .. మొజ్తబా ఖమేనీ తలపై రూ.92 కోట్ల రివార్డు ప్రకటన ..!

  • MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

Trending News

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd