HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nadu Tandlata Today Tandalu Is The Path Of Development Minister Errabelli

BRS Minister: నాడు తండ్లాట‌.. నేడు తండాలు అభివృద్ధి బాట‌: మంత్రి ఎర్రబెల్లి

ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు.

  • Author : Balu J Date : 29-09-2023 - 5:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

కొడ‌కండ్ల‌ (పాలకుర్తి నియోజకవర్గం), సెప్టెంబర్ 29 : తెలంగాణ‌కు ముందు నాడు తండాల‌ది, తండా వాసుల‌ది చెప్ప‌న‌ల‌విగాని తండ్లాట‌…! నేడు అవే తండాలు అభివృద్ధి బాట ప‌ట్టాయి. ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తున్నాయి. తండాలు నాడు శివారు ప‌ల్లెలుగా అభివృద్ధికి నోచుకోక అర్రులు చాచేవి. నేడు స్వ‌యం పాల‌నలో స్వ‌తంత్ర పాల‌న సాగించుకుంటూ గ్రామ పంచాయ‌తీలుగా వెలుగొందుతున్నాయి. నాడు 7శాత‌మే రిజ‌ర్వేష‌న్లు ఉండే! నేడు కెసిఆర్ సిఎం అయ్యాక‌ 12శాతానికి రిజ‌ర్వేష‌న్లు పెంచారు. కానీ, కాంగ్రెస్ నేడు గిరిజ‌నుల మ‌ధ్య వ‌ర్గీక‌ర‌ణ‌ చిచ్చు పెడుతున్న‌ది. నాడు అభివృద్ధి కోసం అర్రులు చాచిన తండాలే…! నేడు ప్ర‌గ‌తి ప‌థాన న‌డుస్తున్నాయి. నాడు క‌నీస స‌దుపాయాలు క‌రువు! కానీ, నేడు స‌క‌ల సౌక‌ర్యాల‌కు నెల‌వుగా తండాలు మారాయి. నాడు క‌న్నీటి కడ‌లిలు…! నేడు సాగు, తాగునీటికి నెల‌వులు!! ఇదంగా సీఎం కెసిఆర్ ద‌య వ‌ల్లే జ‌రిగాయి. అందుకు తండా వాసులు కెసిఆర్ కు రుణ ప‌డి ఉండాలె. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం కొడ‌కండ్ల మండ‌లం గిర్ని తండ, మైదం చెరువు తండ, చెరువు ముందు తండ, నీలిబండ తండా, బొడోని కుంట తండ, రామేశ్వరం, కడగుట్ట తండ, హక్య తండాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మండ‌లంలో తండా బాట నిర్వహించారు. పార్టీ జెండాలు ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ నూతన భవనాలకు శంకుస్థాపన, అలాగే సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొన్ని బీటీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు, వివిధ గుడు ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి కొడ‌కండ్ల మండ‌లంలో తండా బాట నిర్వ‌హించారు. అలాగే తండాల‌కు మినీ ఫంక్ష‌న్ హాళ్ళ త‌ర‌హాలో క‌మ్యూనిటీ భ‌వ‌నాలు మంజూరు చేస్తున్న‌ట్లు చెప్పారు. గిర్నితండా, మైదం చెరువు తండా దుర్గ‌మ్మ‌, ఎల్ల‌మ్మ గుడుల నిర్మాణానికి రూ.20ల‌క్ష‌లు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ కు ముందు తండాలు సాగునీరు, లేక‌, మంచినీరు లేక‌, క‌నీస స‌దుపాయాలు లేక తండ్లాడేవి. కనీస సౌక‌ర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ తర్వాత, కెసిఆర్ సీఎం అయ్యాక తండాల తండ్లాట త‌ప్పించారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చారు. వారి తండాల్లో వారి రాజ్యాన్ని తెచ్చారు. దీంతో మంచినీటి కోసం కిలోమీట‌ర్ల కొద్ది పోయే బాధ త‌ప్పింది. సాగునీటితోపాటు భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. ఇత‌ర గ్రామాల శివార్లుగా ఉండే తండాల‌కు క‌నీస స‌దుపాయాలు క‌లిగాయి. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక్కో తండాకు రూ.కోటి తో అభివృద్ధి జరిగింది. ఇంకా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి తండాకు నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు అవుతున్నది. అన్నారు.

ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది అయితే, అదే ఎస్ టి లలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండి అంటూ…మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు.తెలంగాణకు ముందు రాష్ట్రంలో తండాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వని హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్నది. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్ వచ్చేది లేదు. ఇచ్చేది లేదు అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్ళీ క‌ష్టాలు త‌ప్ప‌వు అన్నారు. రైతుల న‌డ్డి విర‌వ‌డానికి 3 గంట‌ల క‌రెంటు చాలంటోంది. 24 గంట‌ల క‌రెంటు కావాలా? 3 గంటల క‌రెంటు కావాలా? 3 పంట‌ల బిఆర్ ఎస్ కావాలా? ప్ర‌జ‌లు తేల్చుకోవాలి. మ‌న కోసం పాటుప‌డుతున్న సీఎం కెసిఆర్ కు, నాకు అండ‌గా నిల‌వాలి. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. క‌ష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియ‌ని వాళ్ళు మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌లు అయిపోతే వారు వెళ్ళిపోతారని ఆయ‌న అన్నారు. ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం దిద్ది, ఎడ్ల బండి పై ఊరేగిస్తూ, బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బతుకమ్మలను ఎత్తుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Minister
  • cm kcr
  • telangana
  • tribals

Related News

Maoists Khali

మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

ఈ భారీ లొంగుబాటుకు ప్రధాన కారణాలు వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో పాటు పార్టీ మారుతున్న పోకడలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాల పాటు అడవిలో గడిపిన ఈ నేతలు ప్రస్తుతం వృద్ధాప్య ఛాయలు, సరైన వైద్యం అందకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు

  • Uttam Kumar Reddy

    శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • Zaheerabad

    తెలంగాణ లో మరో నగరం రియల్ హాట్ స్పాట్ గా మారబోతుంది !!

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

  • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

  • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

  • ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd