HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Minister Sridhar Babu Clarity On Increase In Retirement Age Of Employees

TG : ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు పై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Author : Latha Suma Date : 29-01-2025 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Sridhar Babu clarity on increase in retirement age of employees
Minister Sridhar Babu clarity on increase in retirement age of employees

TG : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచనలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 7న ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్‌లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. కొత్త ఐటీ పాలసీను విడుదల చేసి రాష్ట్రాన్ని ఆ రంగంలో దేశంలో అగ్రగామిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కంటే కాంగ్రెస్ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి లాజిస్టిక్స్ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నార్త్ కారిడార్ కేంద్రంగా డ్రైపోర్ట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ డ్రైపోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే పొందినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణలో రెండు డ్రైపోర్టులు ప్రారంభం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, టైర్-2 నగరాల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • employees
  • increase in retirement age
  • Minister Sridhar Babu
  • telangana government

Related News

CM Revanth Reddy

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహ

  • Good News For Telangana Gov

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Latest News

  • మణికొండలో పగిలిన పైప్‌లైన్‌.. కాలనీలను ముంచెత్తిన వరద

  • ఇళయరాజా కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

  • KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

  • Gold Price: బంగారం ధర ఢమాల్..బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd