Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్య (Minister Gunman Suicide)కు పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
- By Gopichand Published Date - 08:55 AM, Sun - 5 November 23

Minister Gunman Suicide: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్య (Minister Gunman Suicide)కు పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ హోటల్‌లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూతురుతో మాట్లాడిన తర్వాత ఏఎస్సై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మంత్రి సబిత, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Also Read: Diwali – Special Trains : దీపావళికి స్పెషల్ ట్రైన్స్.. ఏపీలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే
ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఫాజిల్ సూసైడ్‌కు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా? లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
We’re now on WhatsApp : Click to Join