AP Minister: ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మంత్రి అంబటి రియాక్షన్
- By Balu J Published Date - 11:30 AM, Mon - 4 March 24

AP Minister: ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ఏం చేసినా జగన్ గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎన్నికల్లో పనికిరాదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకుముందు లగడపాటి , ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెడీ ఎన్నికల జోస్యం చెబుతున్నారని, లగడపాటి లాగే పీకే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారని అన్నారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గతంలో సొంతంగా సర్వేలు చేయించుకుని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసేవారు. ఐపాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వ్యూహకర్తగా పనిచేయడం మానేసి రాజకీయాలపై దృష్టి సారించారన్నారు. ప్రస్తుతం అంబటి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
నాడు లగడపాటి
సన్యాసం తీసుకున్నాడు!
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్
సిద్దంగా వున్నాడు! @PrashantKishor— Ambati Rambabu (@AmbatiRambabu) March 3, 2024