Telangana Inti Party: కాంగ్రెస్‌లో ‘తెలంగాణ ఇంటి పార్టీ’ విలీనం
ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతుంటే..
- By Balu J Published Date - 12:19 PM, Fri - 5 August 22

ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతుంటే.. మరోవైపు చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ ఢిల్లీ వేదికగా విలీనమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కార్యక్రమంలో చెరుకు సుధాకర్‌తో పాటు ఆ పార్టీ నాయకులు నాయకులు బత్తుల సోమయ్య, సందీప్ చమార్, కాంగ్రెస్ నాయకుడు సత్తు మల్లేష్ పాల్గొన్నారు.