Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా బలగాలు..!
- By HashtagU Desk Published Date - 01:40 PM, Sat - 12 March 22

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య 17 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపాలని ప్రపంచ దేశాలు మొత్తుకున్నా పుతిన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాలపై రష్యా సైనిక దళం బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో మరి కొన్ని గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మరో ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే.. ఉక్రెయిన్‌లోని ఓ నగర మేయర్‌ను రష్యా ఆర్మీ కిడ్నాప్ చేశాయని తెలుస్తోంది. తమకు సహకరించలేదని ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌ను రష్యా బలగాలు అపహరించినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన ఓ అధికారి ఇవాన్ కిడ్నాప్‌కు చెందిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక ఈ కిడ్నాప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి చర్యలు అక్రమం అని..యుద్ధ నేరం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగరం చాలా రోజుల క్రితమే రష్యన్ సేనల నియంత్రణలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.
In this today's video from the occupied #Melitopol city in #Zaporizhzhya province you can see how in the middle of the day the #Russian soliders kidnap Ivan Fedorov, a mayor of the city. Video shared by the Ukraine presidential office (Kyrylo Tymoshenko). [Thread⬇️] pic.twitter.com/ei5cykbSYP
— Viktor Kovalenko (@MrKovalenko) March 11, 2022