Medico Preethi: నాలుగు నెలల తరువాత ప్రీతి గది తెరిచిన పోలీసులు
కొన్ని నెలల క్రితం మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యా యత్నం అందర్నీ కలవరపెట్టింది
- By Praveen Aluthuru Published Date - 08:03 PM, Wed - 7 June 23

Medico Preethi: కొన్ని నెలల క్రితం మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యా యత్నం అందర్నీ కలవరపెట్టింది. తన గదిలో పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని చనిపోయిన ప్రీతి గదిని ఈ రోజు పోలీసులు తెరిచారు. దాదాపు నాలుగు నెలల తరువాత ప్రీతి ఉన్న గదిని బుధవారం తెరిచారు పోలీస్ అధికారులు.
హైదరాబాద్‌కు చెందిన ప్రీతి వరంగల్ లోని కేఎంసీలో పీజీ చదువుతుంది. అలాగే వరంగల్ ఎంజీఎంలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడంతో ఆమె నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించింది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఇదిలా ఉండగా దాదాపుగా నాలుగు నెలల తరువాత ప్రీతి ఆత్మహత్య చేసుకున్న గది 409 ని ఈ రోజు కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో తెరిచారు. ప్రీతీ దుస్తులు, ఆమె ఇతర పరికరాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రీతిని గుర్తు చేసుకుని గుండెలు బాదుకున్నారు. ప్రీతి లగేజ్ ని కుటుంబ సబ్యులకు అప్పగించారు పోలీస్ అధికారులు.
Read More: Rajasthan: పెళ్లి కావాల్సిన యువతని కిడ్నాప్ చేసిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే?