Crime News: ఐదేళ్ల క్రితం జరిగిన హత్యపై ఇప్పుడు కేసు నమోదు
కట్నంతో పాటు బైక్ ఇవ్వలేదనే కారణంతో ఐదేళ్ల క్రితం ఓ వివాహితను హత్య చేసిన ఘటన గోపాల్‌గంజ్ జిల్లా బోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రౌలీ గ్రామంలో జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 08:47 AM, Sun - 30 April 23

Crime News: కట్నంతో పాటు బైక్ ఇవ్వలేదనే కారణంతో ఐదేళ్ల క్రితం ఓ వివాహితను హత్య చేసిన ఘటన గోపాల్‌గంజ్ జిల్లా బోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రౌలీ గ్రామంలో జరిగింది. అయితే ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మృతురాలి తండ్రి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కేసు నమోదైంది.
పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రౌలీ గ్రామానికి చెందిన జైరామ్ యాదవ్ తన కుమార్తెను మే 1, 2018న మథౌలీ గ్రామానికి చెందిన రాజ్ కిషోర్ యాదవ్‌తో వివాహం జరిపించాడు. బైక్ కోసం ఆమెను నిత్యం వేధించేవాడు. ఇదిలా ఉండగా 2018 ఆగస్టు 17న ఆమెను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిమృతదేహాన్ని దహనం చేశాడు ఆ నరరూప రాక్షసుడు.
ఈ కేసులో మృతురాలి తండ్రి జైరామ్ యాదవ్ పలుమార్లు పోలీసు అధికారులకు విన్నవించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జైరామ్ యాదవ్ కోర్టు తలుపు తట్టారు. ఐదేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని బోర్ పోలీస్ స్టేషన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గంగాజలీ దేవి, మిథు యాదవ్, రాజ్‌కిషోర్ యాదవ్ సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Read More: Liquor Bottles Seized : కర్నూల్‌లో అక్రమ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్