MANSAS: మరోసారి మాన్సాస్ వివాదం.. ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు!
- By Balu J Published Date - 04:00 PM, Thu - 6 January 22
మాన్సాస్ ట్రస్ట్ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రస్టు అనుమతి లేకుండా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో మన్సూస్ ట్రస్ట్ ఆస్తులను సర్వే చేశారని ఈవో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కోట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పబ్లిక్ పార్కింగ్‌కు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారని.. మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే ఖాళీ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కలెక్టర్‌కు ఈవో లేఖ రాశారు. ఆస్తులకు రక్షణ కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అయితే మాన్సాస్ ట్రస్టుకు చెందిన ఖాళీ స్థలంలో ప్రైవేట్ సెక్యూరిటీ కాపలా కాస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వీరభద్రస్వామి అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత అశోక్‌గజపతి రాజు మద్దతుతో ఎమ్మెల్యేపై ఈఓ ఫిర్యాదు చేశారని ఆరోపించారు.