HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Godavari Districts Are Gearing Up For Cockfighting

కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-01-2026 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Godavari Districts kodi pandalu
Godavari Districts kodi pandalu

Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్‌తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపారం ఏటా రూ.5 కోట్లకు చేరుకుంటుంది.

  • కోడి పందేలకు ముస్తాబవుతోన్న గోదావరి జిల్లాలు
  • కత్తులను కట్టేవాళ్లకు నాలుగు రోజులు డిమాండ్
  • ఒక్కసారి కడితే రూ.25 నుంచి రూ.35 వేలు వసూలు

Godavari Districts Kodi Pandalu సంక్రాంతి అంటేనే కోడి పందేలు .. ఇవి లేకుంటే అసలు పండుగ సందడే ఉండదు. భోగీ, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా వస్తారు. అయితే, సరదా కోసం ఆడే ఈ పందేల్లో కోడికి కట్టే కత్తే కీలకం. ఇది తగిలితే రక్తం ధారలై పారి, దెబ్బ తగిలిన క్షణాల్లో కోడి నేలకొరుగుతుంది. బరుల్లో వీటి పాత్ర ఎంతో ముఖ్యం. సంక్రాంతి వేళ ప్రతి గ్రామంలోనూ వీటిపైనే చర్చ జరుగుతోంది. ఆరు అంచెల్లో కోడి కత్తులను సానబెడతారు. మొన వంగిపోవడం లేదా విరిగిపోకుండా ఉండాలంటే చాలా గట్టిదనం ఉండాలి. అందుకే వాహనాల చక్రాల బేరింగుల్లో వినియోగించే స్టీల్‌తో ఈ కత్తులను వీటిని తయారు చేస్తారు. వాటికి అత్యంత గట్టిదనం వచ్చేలా కొలిమిలో ఆరుసార్లు కాల్చుతారు.

ఇక, పందేల బరుల్లో కోడి పుంజు కాళ్లకు కత్తులు కట్టడం కూడా ఓ ఆర్ట్. వీటి కట్టడం అందరి వల్ల కాదు. అందుకే పండగ సమయంలో కోడి కత్తులు కట్టే వారికి ఫుల్ డిమాండ్‌ ఉంటుంది. కోడికి ఈ కత్తి కట్టడంలోనే పందెం ఆధారపడి ఉంటుందని అంటారు. బరిలో దిగే పుంజు కుడికాలి పిల్లవేలికి ఈ కత్తిని కడతారు. పందెం జరుగుతున్నంత సేపూ కత్తికట్టే వ్యక్తి దానిని గమనిస్తూనే ఉంటాడు. కత్తి విరిగినా, దిశ మారినా మధ్యో ఆపేసిన సరిచేసి మళ్లీ మొదలుపెడతారు. పందెం గెలిస్తే రూ.లక్షల్లో వస్తాయి. అందుకే రోజుకు కత్తి కట్టేవాళ్లకు రూ.25- రూ.35 వేల వరకు ముట్టజెబుతారు.

కాగా, కోడి కత్తులు తయారు చేసే ఖర్ఖానాలు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం, నూజివీడు, గురవాయి పాలెం, ముప్పర్తిపాడు, తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఎదుర్లంక, కాకినాడ జిల్లాలో సామర్లకోట, అనపర్తి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాలకు సైతం కత్తులను తరలిస్తున్నారు. సంక్రాతి సీజన్‌లో వీటి వ్యాపారం దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అయితే, ఒకరు రోజుకు 5 నుంచి 6 కత్తుల వరకు మాత్రమే తయారు చేయగలరు. అందుకే ఏడాది పొడవునా వీటిని తయారు చేస్తారు. గతంలో వీటి ధర రూ.200- రూ.300 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.1000 వరకు పలుకుతోంది. వీటి తయారికి వాడే ఇనుమును చెన్నై, విజయవాడ, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. ఒక కత్తి ఒక పందేనికి మాత్రమే వినియోగిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Bhogi Festival
  • Godavari Districts
  • kodi kathi
  • kodi pandalu
  • Makar Sankranti
  • makar sankranti 2026

Related News

A Royal Dream for Seema... The Roar of the AMCA in Puttaparthi

Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా భారీ పెట్టుబడులు ఒక్కొక్కటిగా రాయలసీమలో అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో సీమ రూపురేఖలు మారబోతుండగా, మరోవైపు పుట్టపర్తి వేదికగా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన AMCA ప్రాజెక్టుకు అడుగులు పడుతుండటం సంచలనంగా మారింది. రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్

  • Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram

    Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

Latest News

  • UWA : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలో చదివేందుకు గోల్డెన్ ఛాన్స్

  • CEEW : జియోథర్మల్ ఎనర్జీ – ఏపీ, తెలంగాణ సహా కీలక రాష్ట్రాల్లో భారీ అవకాశాలు

  • Survival : సంపూర్ణ ఆరోగ్య పునరుద్ధరణే లక్ష్యంగా ‘రికవరీ వన్ 2026’

  • Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

  • Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

Trending News

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd