Manipur Violence: మణిపూర్‌లో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిప్పు
మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి ఒక గుంపు నిప్పుపెట్టింది.
- By Gopichand Published Date - 08:30 AM, Fri - 16 June 23

Manipur Violence: మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి ఒక గుంపు నిప్పుపెట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఇంట్లో లేరన్నారు. ఇది మాత్రమే కాదు కొత్త చెకాన్‌లోని రెండు ఇళ్లను కూడా దుండగులు తగులబెట్టారు. అనంతరం భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. అంతకుముందు జూన్ 14న ఇంఫాల్‌లోని లాంఫెల్ ప్రాంతంలో మహిళా మంత్రి నెమ్చా కిప్‌జెన్ అధికారిక నివాసానికి కూడా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. మంగళవారం (జూన్ 13) ఉగ్రవాదులు ఆకస్మికంగా జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఈ సమయంలో ఖమెన్‌లోక్ గ్రామంలోని అనేక ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించాయి. తమెంగ్‌లాంగ్ జిల్లాలోని గోబజాంగ్‌లో పలువురు గాయపడినట్లు సమాచారం.
Also Read: Monitoring 100 Apps : గేమింగ్ యాప్స్ తో మత మార్పిడులు ? 100 యాప్స్ పై స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..?
ఈ సమయంలో మణిపూర్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఇంటర్నెట్ సేవలు కూడా మూసివేయబడ్డాయి. అంతే కాదు కనీస అవసరాల కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హింసాత్మక మణిపూర్‌లో శాంతి కోసం ఒక నెలకు పైగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. PTI ప్రకారం.. ఒక నెల క్రితం మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జరిగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ఆర్మీ, పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దించారు.