Suicide : రాజేంద్రనగర్‌లో వ్యక్తి ఆత్మహత్య.. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్
- By Prasad Published Date - 06:47 AM, Tue - 21 February 23

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో నివాసముంటున్న మహ్మద్ అహ్మద్ (35) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మహ్మద్ అహ్మద్ వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అహ్మద్ ఒకరితో ఫోన్‌లో మాట్లాడి తన ఇంటి గదిలోకి వెళ్లాడు. ఆ తరువాత కండువాతో పైకప్పుకు ఉరివేసుకున్నాడని రాజేంద్రనగర్ సబ్ ఇన్స్పెక్టర్ కిషన్జీ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.