Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి
ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది
- By Praveen Aluthuru Published Date - 02:27 PM, Mon - 15 July 24

Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటడం ఎంత ప్రమాదమో జరిగిన ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. తాజాగా హైదరాబాద్-వరంగల్ హైవేపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే..
జులై 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది. అయితే కారును తప్పించే అవకాశం లేకపోవడం ఆ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ ప్రమాదంలో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే కారు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి వ్యక్తిని ఢీ కొట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి రోడ్డుపై పడి తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఫిర్యాదుదారు వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వజ్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు డ్రైవర్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి ఎర్ర కారు కోసం గాలిస్తున్నారు.
In yet another accident, a man crossing the Hyderabad-Warangal highway was struck by a car.
Following the collision, the man was thrown into the air near NTPC X road. pic.twitter.com/Ah02zZfNNP
— The Siasat Daily (@TheSiasatDaily) July 15, 2024
తాజాగా హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌ను మరో వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గత నెలలో అత్తాపూర్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 16 ఏళ్ల బాలిక మినీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో గచ్చిబౌలిలో బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో 22 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
Also Read: Vijaya Sai – Shanthi Issue : నన్ను కలిస్తే అక్రమ సంబంధం అంటగడతారా..? – ఎంపీ విజయసాయి రెడ్డి