Maheshwar Reddy : దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని అన్నారు
- By Sudheer Published Date - 09:07 PM, Mon - 22 July 24

బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Maheshwar Reddy)..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలోనే భారీ అవినీతి మంత్రి పొంగులేటినే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని అన్నారు. రాష్ట్ర మంత్రిగా పొంగులేటి కొనసాగే అర్హత లేదని.. వెంటనే యూరో ఎగ్జిన్ బ్యాంక్ గ్యారంటీలపై విచారణ జరిపించాలని ఏలేటి డిమాండ్ చేశారు. అలాగే ఈ కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు తాను త్వరలోనే బయటపెడతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సర్పంచులకు బిల్లు రావు కానీ.. మంత్రి పొంగులేటి వందల కోట్ల చెల్లిస్తున్నారని మండిపడ్డారు.
ఫేక్ డాక్యుమెంట్లతో రూ.వేలకోట్ల కాంటాక్టులు తీసుకుంటున్నారని.. ప్రభుత్వం, చట్టాలను మోసం చేస్తున్నారన్నారు. వీటిపై ఎంత పెద్దవారున్నా న్యాయ విచారణ చేయాల్సిందేనన్నారు. సీబీఐ విచారణ సైతం జరగాల్సిందేనన్నారు. భారత దేశ చట్టాలను అతిక్రమిస్తున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలన్నారు. ఎస్‌బీఐ ఏ అధికారంతో ఇచ్చింది.. ఇవ్వనట్లయితే ఫేక్‌వి సృష్టించారా? అనే దానిపై విచారణ జరగాలన్నారు.
Read Also : Padma Award Winners : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త