Voting: ఇదేందయ్యా ఇది.. ఆ గ్రామంలో కేవలం 30 సెకండ్లలో ఓటింగ్ పూర్తి?
ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్న విషయం తెలిసిందే. కొందరు ఈ విషయంలో తమకేం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ
- By Nakshatra Published Date - 07:50 PM, Mon - 29 May 23
ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్న విషయం తెలిసిందే. కొందరు ఈ విషయంలో తమకేం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఓటింగ్ జరుగుతుంది అంటే వెళ్దాంలే అన్నట్టుగా నిదానంగా వారి పనులను ముగించుకున్నాక పోలింగ్ కేంద్రానికి వెళుతూ ఉంటారు. ఓటింగ్ సమయానికంటే ముందు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేయడం ఓటు వేసేదానికి ఎదురు చూడడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆ గ్రామంలో మాత్రం ఓటర్లు ఎదురు చూడటంతో పాటుగా పోలింగ్ మొదలైన అర నిమిషంలో పై అందరూ ఓటేసి 100% పోలింగ్ నమోదు చేశారట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆ గ్రామం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్పెయిన్ దేశంలోని లా రియోజా ప్రావిన్స్‌లో విల్లారోయా అనే కుగ్రామం ఉంది. కేవలం పదుల సంఖ్యలో జనాభా మాత్రమే ఉండే ఈ గ్రామంలో ఓటు హక్కు ఉన్నవారు ఏడుగురు. అయితేనేం ఓటు వేయడంలో ముందుండి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మే 28న ఆదివారం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా వీరు సరికొత్త రికార్డు సృష్టించారు.
కేవలం 29.53 సెకన్ లలో వీరంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో 32 సెకన్లలో వీరు ఓటింగ్ పూర్తి చేయగా ఇప్పుడు వారి రికార్డును వారే బద్దలుకొట్టారు. దీనిపై ఆ ప్రాంత మేయర్ సాల్వడార్ పెరెజ్ మాట్లాడుతూ.. ఈ గ్రామస్థులు ఓటు వేయడంలో అత్యంత నైపుణ్యం కలవారు. పోలింగ్ కేంద్రానికి ముందే వచ్చి ఎదురుచూస్తారు. పోలింగ్ మొదలవ్వగానే వీలైనంత వేగంగా ఓటు వేస్తారు. అలా ఈ సారి 30 సెకన్లలోపే ఓటింగ్ పూర్తి చేశారు. స్పెయిన్‌లో ఓటింగ్ పూర్తిచేసే తొలి ప్రాంతం విల్లారోయా గ్రామమే అని తెలిపారు.
Related News
Chandrababu: రేపు ఉండవల్లికి చంద్రబాబు.. కుటుంబ సమేతంగా ఓటింగ్
Chandrababu: ఏపీలో ఈ సారి రికార్డుస్థాయిలో పోలింగ్ జరగబోతోంది. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానుండటంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటు వేయనున్నారు. ఉండవల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఓటు వేస్తారు. గ�