Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
- Author : Sudheer
Date : 05-04-2024 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం ఆగడం లేదు. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల చేరికలు రోజు రోజుకు ఎక్కవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా…నేడు బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ (BJP leader Kuna Srisailam Goud) కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ఈ టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన కూన శ్రీశైలం గౌడ్ ఈ రోజు కాంగ్రెస్‌లో చేరారు. నిన్న కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలను హనుమంతరెడ్డి, భూపతిరెడ్డిలు ఆయన నివాసానికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ఆయన మన్నించారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన.. 2009లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ఇండిపెండెంట్గా కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో బీజేపీలో చేరిన ఆయన.. 2023లో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ చేతిలో 85,576 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈరోజు ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కూన.. అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డిలు కూన శ్రీశైలం గౌడ్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
Read Also : Ranbir Kapoor : రణ్‌బీర్ రామాయణం కోసం.. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్..