KTR Injured : కేటీఆర్ కు గాయం ..పార్టీ శ్రేణుల్లో ఆందోళన
KTR Injured : జిమ్ వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో గాయం (Injured ) తగిలినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు
- By Sudheer Published Date - 08:30 PM, Mon - 28 April 25

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు గాయమైంది. జిమ్ వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో గాయం (Injured ) తగిలినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ గాయం కారణంగా కేటీఆర్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కేటీఆర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి పార్టీ పనులను కొనసాగించాలని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. ఈ గాయం వార్త తెలిసి అభిమానులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ గాయపడ్డ విషయం తెలిసిన వెంటనే వైద్యులు ఆయన్ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ గాయం చాలా తీవ్రంగా కాకపోయినప్పటికీ, పూర్తి కోలుకోవడం కోసం ఆయనకు విశ్రాంతి అవసరం. ఇక నిన్న ఎల్కతుర్తి లో బిఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వేడుక అట్టహాసంగా నిర్వహించబడింది.
Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctors
Hope to be back on my feet soon
— KTR (@KTRBRS) April 28, 2025