HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ktr Criticizes Congress Policies And Aicc Satisfaction On State Governance

KTR : అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా?

KTR : అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా? అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్‌. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, "రాష్ట్ర రైతులను జైలుకు పంపినందుకు, భూములు బలవంతంగా గుంజుకున్నందుకు, రైతులను కొనుగోలు కేంద్రాల్లో అవమానించినందుకు, ఏఐసీసీకి అంత సంతృప్తి వచ్చిందా?" అని విరుచుకుపడ్డారు.

  • By Kavya Krishna Published Date - 05:18 PM, Sun - 17 November 24
  • daily-hunt
Boycotting orientation session of legislators: KTR
Boycotting orientation session of legislators: KTR

KTR : బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేయడాన్ని ట్విటర్ వేదికగా ఆక్షేపించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా? అంటూ ప్రశ్నలు సంధించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, “రాష్ట్ర రైతులను జైలుకు పంపినందుకు, భూములు బలవంతంగా గుంజుకున్నందుకు, రైతులను కొనుగోలు కేంద్రాల్లో అవమానించినందుకు, ఏఐసీసీకి అంత సంతృప్తి వచ్చిందా?” అని విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో వేల ఇళ్లను కూల్చివేయడంపై మండిపడిన కేటీఆర్, పేద ప్రజలను హైడ్రా పేరిట భయపెట్టడమే మీ పాలనలో ముఖ్య కార్యక్రమమా? అని నిలదీశారు. “ఏడాది దాటిపోయింది గానీ, గ్యారెంటీ కార్డులు పాతాళానికి పోయాయి. రెండు లక్షల ఉద్యోగాల హామీ గాలిలో కలిసిపోయింది.

Arvind Kejriwal : కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్‌

సంక్షేమాన్ని సమాధి చేసి, అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేయడం మీ పాలన ప్రథమ లక్ష్యమా?” అని విమర్శించారు. తెలంగాణ రైతులను, పేదలను, వివిధ వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పాలనకు ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అన్నివర్గాలను ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, దీనిని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఎలా సంతృప్తితో సమర్థిస్తోందని ప్రశ్నించారు. “నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ ఈ అవినీతి, నిర్లక్ష్య పాలనపై రగిలిపోతున్నారు. మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం ఆగిపోయింది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీపై ప్రత్యేకంగా విమర్శలు చేసిన కేటీఆర్, “మీరు ఎన్నికల హామీగా 100 రోజుల్లో తెలంగాణ మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పటికి 350 రోజులు దాటిపోయాయి. రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళలు మీ హామీ నెరవేర్చాలని ఎదురు చూస్తున్నారు. మాటలు చెప్పడం తప్ప హామీలను నెరవేర్చడంలో మీకు చిత్తశుద్ధి ఉందా?” అని నిలదీశారు. కేటీఆర్ ట్వీట్లలో, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజాసంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని, ఇది ప్రజల ద్రోహానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. “మీ వాగ్దాన విఫలతలతో మీరు విసిగిపోలేదా? ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందా?” అంటూ తన ట్వీట్స్‌ను ముగించారు.

Dhanush VS Heroine Nayanatara : మీరు మారండి ..అంటూ ధనుష్ ను ఉద్దేశించి విఘ్నేశ్ ట్వీట్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AICC Satisfaction
  • Congress Criticism
  • Congress Promises
  • Farmer Issues
  • ktr
  • KTR tweets
  • KTR vs Congress
  • political commentary
  • rahul gandhi
  • telangana development
  • telangana government
  • telangana politics
  • Telangana Welfare

Related News

Mary Millben Rahul

Rahul Gandhi : రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

Rahul Gandhi : రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో “మోదీ, ట్రంప్‌కు భయపడుతున్నారు” అని విమర్శించగా, అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఆమె ట్విట్టర్ (X) వేదికగా రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Vote Chori Jublihils

    Vote Chori : జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd