Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం..నలుగురి పై కేసు నమోదు
కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు.
- By Latha Suma Published Date - 05:21 PM, Wed - 5 February 25

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైల్లో చైతన్య తమను కలిసి మభ్యపెట్టినట్లు గతంలో ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
Read Also: TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జైలులో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈక్రమంలోనే వివేకా కేసులో కేవలం బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్‌గా మారి అపద్దాలు చెప్పాల్సి వచ్చిందని.. చెప్పమని చైతన్య ఒత్తిడి తెచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా చేస్తే రూ.20 కోట్లు ఇస్తామని చైతన్య మభ్యపెట్టినట్లు అప్పట్లో దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చైతన్య రెడ్డితో పాటు అప్పట్లో కేసు నమోదు చేయకుండా నిందితులకు సపోర్టు చేయమని తనపై ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారులపైనా దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ జైలు సూపరెండెంట్ ప్రకాష్‌లపై పులివెందుల పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు.
కాగా, తనతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు ఉన్నట్లు తెలిపారు. తాను నిజంగా జైలుకు బెదిరించడానికే వెళ్లి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయాలేదని అప్పట్లోనే చైతన్య రెడ్డి ప్రశ్నించారు. దస్తగిరిది అంతా క్రిమినల్ మైండ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో దస్తగిరి ఫిర్యాదును తప్పుబట్టారు చైతన్య. కేవలం మెడికల్ క్యాంపు కోసమే జైలు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల చైతన్య రెడ్డి ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.
Read Also: Causes Of Cancer: 20 శాతం క్యాన్సర్ మరణాలకు ఆహారం కారణమా?