Air India: విమానం నుంచి దూకేస్తానని వ్యక్తి నానా హంగామా
ఎయిరిండియా విమానంలో నుంచి దూకేస్తానని బెదిరించిన కన్నూర్‌కు చెందిన వ్యక్తిని మమ్మగలూరులో అరెస్టు చేశారు. ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వివరాలలోకి వెళితే..
- Author : Praveen Aluthuru
Date : 12-05-2024 - 5:19 IST
Published By : Hashtagu Telugu Desk
Air India: ఎయిరిండియా విమానంలో నుంచి దూకేస్తానని బెదిరించిన కన్నూర్‌కు చెందిన వ్యక్తిని మమ్మగలూరులో అరెస్టు చేశారు. ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వివరాలలోకి వెళితే..
కన్నూర్‌కు చెందిన మహ్మద్ బీసీ అనే వ్యక్తిని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎగురుతున్న విమానం నుంచి దూకేస్తానని బెదిరించాడు. దీంతో సిబ్బంది, తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సిద్ధార్థ దాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మే 8న జరగగా.. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని దుబాయ్ నుంచి మంగళూరుకు మళ్లించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు విమానం మంగళూరు చేరుకోగానే అతడిని అరెస్టు చేశారు.
ఢిల్లీ నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక ముబమ్మద్ బీసీ సమస్య మొదలైంది. అతను టాయిలెట్‌కి వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత మరో ప్రయాణికుడి గురించి సిబ్బందిని ఆరా తీశారు. అయితే అలాంటి వ్యక్తి ప్రయాణికుల జాబితాలో లేడు. తర్వాత బెల్ కొట్టి ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. అరేబియా సముద్రం మీదుగా ఎగురుతూ సముద్రంలో దూకుతానని కూడా బెదిరించాడు.
విమానం మంగళూరుకు రాగానే ఉటానే విమానాశ్రయంలో మహ్మద్ బిసిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుతో బజ్పే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Also Read: Prashant Kishore : జగన్ ఓటమి ఖాయం.. టీడీపీలోకి బొత్స జంప్ : పీకే సంచలన వ్యాఖ్యలు