HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jagilas Are Proof Of Unconditional Love Dgp Ravigupta

DGP: షరతులు లేని ప్రేమకు నిదర్శనం జాగిలాలు : డీజీపీ రవిగుప్త

  • Author : Balu J Date : 23-02-2024 - 6:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dogs
Dogs

DGP: ఏ రకమైన షరతులు లేని ప్రేమకు జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో శుక్రవారం నాడు 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….జాగిలాలు ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు దర్యాప్తు చేసి చేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు. ఎన్నో కేసుల దర్యాప్తులో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయని తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో జాగిలా లు కనబరుస్తున్న ప్రతిభ, క్రమశిక్షణలను చూసి ముగ్దుడునయ్యానని అన్నారు.

ఐఐటిఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిందని, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారని ఆయన తెలియజేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల జాగీలాలకు ఐఐటిఏ శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు .ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్ లో పథకాలు సాధించారని ప్రశంసించారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ…. దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సాధించిన విజయాలలో పోలీస్ జాగిలాలు ప్రశంసాపూర్వక పాత్రను నిర్వహించాయని వెల్లడించారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఐఐటిఏ సిబ్బంది ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఐఐటిఏ కృషిని ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు ప్రశంసించడంలో అతిశయోక్తి లేదని, వారి శ్రమకు ఇది నిదర్శనమని అభివర్ణించారు. భవిష్యత్తులో ఐఐటిఏ సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని అడిషనల్ డిజిపి ఆకాంక్షించారు. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ ప్రారంభోపన్యాసం చేస్తూ… బీహార్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి పంపిస్తున్న పోలీస్ జాగిలాలకు ఐఐటిఏ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 21 జాగిలాలు 28 మంది కేనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. ట్రాకర్, స్లిప్పర్ ,అసాల్ట్ మరియు నార్కోటిక్ ఫీల్డ్లలో శిక్షణ కొనసాగిందన్నారు. జాగిలాలలో లాబ్రడార్, జర్మన్ షెఫర్డ్ ,బెల్జియన్ ,మలినోయిస్ కాకర్ పానియల్ జాతులు ఉన్నాయన్నారు. 2004వ సంవత్సరంలో 11 జాగిలాలతో ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం దాదాపు 771 జాగిలాలకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dgp
  • hyderabad
  • telangana police

Related News

Shivapratap Shukla Appointed As Telangana New Governor

నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana New Governor  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

  • Motorists Queue For Petrol

    యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

Latest News

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd