IPL 2025 Full Schedule Announcement: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
IPL 2025లో మార్చి 23న 5 సార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
- By Gopichand Published Date - 05:57 PM, Sun - 16 February 25

IPL 2025 Full Schedule Announcement: ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను (IPL 2025 Full Schedule Announcement) బీసీసీఐ తాజాగా ప్రకటించింది. దీంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ 13 వేదికల్లో జరగనుంది. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరగనుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మార్చి 23న రసవత్తర మ్యాచ్
IPL 2025లో మార్చి 23న 5 సార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో జరగనుంది.
HERE IS THE FULL SCHEDULE OF MUMBAI INDIANS IN IPL 2025 💙 pic.twitter.com/jRXYoCiKm4
— Johns. (@CricCrazyJohns) February 16, 2025
Also Read: India Test Vice Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బుమ్రా.. మరీ వైస్ కెప్టెన్ సంగతేంటి?
తొలి మ్యాచ్ మార్చి 22న
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. లీగ్ తొలి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్‌లో జరగనుంది. ఈసారి 65 రోజుల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. ఈసారి మొత్తం 13 వేదికలను ఎంపిక చేసింది. ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లోని నాకౌట్ మ్యాచ్ మొదటి క్వాలిఫయర్ మే 20న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 21న జరగనుంది. ఇది కాకుండా మే 23న క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. క్వాలిఫయర్ 2, ఫైనల్ కోల్‌కతాలో జరగనున్నాయి.
ఎన్ని డబుల్ హెడర్‌లు మ్యాచ్‌లు ఆడనున్నారు?
మొత్తం 13 వేదికల్లో 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. 74 మ్యాచ్‌లలో 70 లీగ్ దశ మ్యాచ్‌లు ఆడనుండగా, 3 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి, ఆపై ఫైనల్ ఆడనున్నారు. అయితే ఈసారి మొత్తం 12 డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. అంటే రోజుకు 12 సార్లు 2 మ్యాచ్‌లు జరుగుతాయి.
IPL 2025 74 మ్యాచ్‌లు 13 వేర్వేరు వేదికలలో ఆడతారు. ఈసారి లక్నో, విశాఖపట్నం, హైదరాబాద్, ధర్మశాల, న్యూ చండీగఢ్, జైపూర్, చెన్నై, అహ్మదాబాద్, గౌహతి, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
IPL 2025 Schedule#IPL2025#MSDhoni pic.twitter.com/4m6IkluvvT
— ROMAN_ROY (@Royshib25) February 16, 2025