India vs England: అభిషేక్ శర్మ ఊచకోత.. టీమిండియా ఘన విజయం
అభిషేక్ 34 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ త్వరగానే విజయానికి చేరువైంది.
- By Gopichand Published Date - 10:15 PM, Wed - 22 January 25

India vs England: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్ జరిగింది. యువ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో టీమిండియా తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-0తో ముందంజలో నిలిచింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత పరుగులు ఛేదించే క్రమంలో టీమిండియా ధాటిగా ఆడింది.
Abhishek Sharma weaving magic and how! 🪄
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs #TeamIndia | #INDvENG | @IamAbhiSharma4 | @IDFCFIRSTBank pic.twitter.com/5xhtG6IN1F
— BCCI (@BCCI) January 22, 2025
Also Read: Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. దావోస్ వేదికపై సీఎం రేవంత్ సరికొత్త రికార్డు!
ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల మోత
ఇంగ్లండ్ తో తొలి మ్యాచ్ కు ముందు అభిషేక్ ఫామ్ పై అందరి మదిలో టెన్షన్ నెలకొంది. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో అభిషేక్ అద్భుతమైన షాట్‌లు కొట్టడంతో ఇప్పుడు అందరూ అతడికి ఫ్యాన్స్ అయిపోయారు. అభిషేక్ 34 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ త్వరగానే విజయానికి చేరువైంది. అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు.
ఓపెనర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, అభిషేక్ శర్మ భారత్‌కు శుభారంభం అందించారు. సంజు ఔట్ అయిన వెంటనే అభిషేక్ మ్యాచ్‌ను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఇంగ్లిష్ బౌలర్లను అభిషేక్ చితకబాదాడు. టీమిండియా బ్యాటింగ్‌లో శాంసన్ (26), అభిషేక్ శర్మ (79), తిలక్ వర్మ (19 నాటౌట్), పాండ్యా (3 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్ చేసి 34 బంతుల్లో 79 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కుప్పకూలిపోయారు. ఇంగ్లండ్ జట్టు మొత్తం 132 పరుగులకే ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి విధ్వంసం సృష్టించి మూడు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.