Team India : ఆ ప్లేయర్‌ని ఎందుకు తీసుకోలేదు.. టీమిండియా ఓటమిపై స్పందించిన మాజీ కోచ్..
ఆసియాకప్‌లో శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై మాజీ కోచ్ రవిశాస్త్రి.....
- Author : Prasad
Date : 08-09-2022 - 10:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఆసియాకప్‌లో శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఫిట్‌గానే ఉన్న సీనియర్ పేసర్ షమీని అసలు జట్టులో తీసుకోకపోవడమేమిటని నిలదీశాడు. పేస్ బౌలర్ల ఎంపిక విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.. ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు సహకరించడంలేదని తెలిసి హార్దిక్ సహా కేవలం నలుగురు పేసర్లతోనే భారత్ టోర్నీకి రావడం ఆశ్చర్యం కలిగించిందని రవిశాస్త్రి అన్నాడు.