India Into Final: ఆసియా గేమ్స్‌లో ఫైనల్ కు చేరిన భారత క్రికెట్ జట్టు.. రికార్డు సృష్టించిన తిలక్ వర్మ..!
2023 ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు (India Into Final) చేరుకుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Author : Gopichand
Date : 06-10-2023 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
India Into Final: 2023 ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు (India Into Final) చేరుకుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 96 పరుగులు చేసింది. అనంతరం భారత్ 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ ఇండియా తరఫున తిలక్ వర్మ 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. రితురాజ్ గైక్వాడ్ అజేయంగా 40 పరుగులు చేశాడు. సాయి కిషోర్ 3 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. భారత జట్టు శనివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా ఫైనల్ కు చేరటంతో దేశానికి మరో రజత పతకం ఖాయమైంది.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా భారత్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. అక్టోబరు 7వ తేదీ శనివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ ఇప్పుడు పాకిస్థాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది.
We’re now on WhatsApp. Click to Join
తిలక్ వర్మ రికార్డు
20 ఏళ్ల తిలక్ వర్మ శుక్రవారం తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. తిలక్ వర్మ 20 లేదా అంతకంటే తక్కువ వయస్సులో అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 20 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సులో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు.
తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 64 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ రెండో వికెట్‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి 97 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.