Boycotted Channels: పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మహా ప్రతిపక్ష కూటమి ఇండియా సిద్దమవుతుంది. ఈ తరుణంలో 14 మంది వార్తా యాంకర్‌లను కూటమి నిషేదించింది.
- By Praveen Aluthuru Published Date - 06:20 PM, Thu - 14 September 23

Boycotted Channels: 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మహా ప్రతిపక్ష కూటమి ఇండియా సిద్దమవుతుంది. ఈ తరుణంలో 14 మంది వార్తా యాంకర్‌లను కూటమి నిషేదించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ చానళ్ళు, షోలపై నిషేధం విధించాలని కూటమి నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రను కొన్ని చాన్నాళ్లు అసలు ప్రచారం చేయలేదని పేర్కొన్నారు. గతంలో లిస్ట్‌లో ఉన్న యాంకర్లు పక్షపాతంతో రిపోర్టింగ్ చేశారని మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని కూటమి భావిస్తుంది. వీరిలో కొందరిపై కేసులు నమోదు కూడా చేశారు. మైనారిటీల సబ్సిడీ పథకంపై’తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఆజ్ తక్ యాంకర్‌పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు . జీ న్యూస్ ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూనే కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని కూటమి భావిస్తుంది. అలాగే న్యూస్18 తో సహా పలువురు యాంకర్స్ పై కూటమి నిషేధం విధించింది
కూటమి నిషేదించిన టీవీ యాంకర్స్:
ఆనంద్ నరసింహన్
అర్నాబ్ గోస్వామి
అశోక్ శ్రీవాస్తవ్
చిత్రా త్రిపాఠి
గౌరవ్ సావంత్
నావికా కుమార్
ప్రాచీ పరాశర్
రూబికా లియాఖత్
శివ అరూర్
సుధీర్ చౌదరి
సుశాంత్ సిన్హా
Also Read: Team India: ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టు ఎంపిక ఎప్పుడో తెలుసా?