HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Impossible For Congress To Win These 3 Constituencies Ktr

KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యం: కేటీఆర్

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన‌ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.

  • Author : Gopichand Date : 27-03-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
Ktr Warning To Congress Gov

KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన‌ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు. రంజిత్ రెడ్డి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు. మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే రంజిత్ ముఖం ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చామ‌న్నారు. అంతేకాకుండా నియోజక వర్గంలో స్వేచ్చ కూడా ఇచ్చామ‌ని అన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్త్యం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పిన‌ట్లు గుర్తుచేశారు. కేవలం అధికారం, ఆస్తుల‌ కోసమే రంజిత్ రెడ్డి బీఆర్‌స్ పార్టీని విడిచి ద్రోహం చేశారని మండిప‌డ్డారు. పార్టీ సీనియర్ నాయకురాలు… రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి… అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడు అని విమ‌ర్శ‌లు చేశారు.

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని అన్నారు అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Also Read: Jagan and Sharmila: షర్మిల మీద జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదా..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనుసులు కలిసినంత మాత్రాన… మిలాఖత్ అయినంత మాత్రనా.. కాంగ్రెస్.. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమ‌ని ఫైర్ అయ్యారు. ఎంపీ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమ‌ని కేటీఆర్ అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కేటీఆర్ చెప్పారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అని కేటీఆర్ అన్నారు. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Lok Sabha Elections
  • brs
  • Chevella
  • congress
  • ktr
  • malkajgiri
  • secunderabad

Related News

Ktr

పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “పొట్టను దాచుకోలేక విసిగి

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

    Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

Latest News

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

  • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd