HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Rajendranagar Leopard Scare At Agriculture University

Leopard : రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు

Leopard : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు.

  • Author : Kavya Krishna Date : 12-01-2025 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Leopard
Leopard

Leopard : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూసినట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు. గతంలోనూ రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతలు కనిపించడం ఇదేం కొత్తకాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చిరుతలు తిరుగుతూ ఉండటం ఇక్కడి ప్రజలందరికీ తెలిసిందే.

గత సంఘటనలు.. చిరుతల వల్ల కలిగిన అనుభవాలు
2020లో హిమాయత్ సాగర్ సమీపంలోని వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్ వద్ద చిరుత దాడి చేసిన ఘటన పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఆ సమయంలో చిరుత ఒక ఆవు దూడను చంపి తింటున్న దృశ్యాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాయి. ఆవుల యజమాని డప్పు శబ్ధం చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ, ఈ ఘటన స్థానికులకు తలకునకలే కలిగించింది.

అధికారుల నిర్లక్ష్యం పట్ల స్థానికుల ఆవేదన
చిరుతల సంచారం పట్ల స్థానికులు గతంలోనే పలుమార్లు అధికారులను అప్రమత్తం చేయడం జరిగినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారం ఇలాగే కొనసాగితే ఎవరి ప్రాణాలకు ఎప్పుడు ముప్పు వస్తుందోనన్న ఆందోళనతో స్థానికులు జీవనం సాగిస్తున్నారు.

ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత ప్రత్యక్షం కావడం కొత్త భయానికి దారి తీసింది. బహిరంగ ప్రదేశాల్లో చిరుత సంచారం వల్ల విద్యార్థులు కూడా తరచూ భయంతో ఉన్నారు. వాకింగ్ చేయడానికి వెళ్లిన వారు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఏర్పడింది. చిరుతలను పట్టుకుని ఈ ప్రాంత ప్రజలను భయం నుంచి విముక్తి చేయడంలో అధికారులు ముందడుగు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Sankranti 2025 : ప్రయాణికుల రద్దీ – ప్రవైట్ కాలేజీల బస్సులు వాడుకోండి : సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agriculture University
  • hyderabad
  • leopard scare
  • Leopard Sighting
  • public safety
  • Rajendranagar
  • telangana news
  • wildlife

Related News

Rowdy Sheeter Rapes A Minor

మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Hyd Parking

    Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

  • Fire in Meerut

    HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !

Latest News

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd