HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Passengers Rush Used Buses For Private Colleges Cm Chandrababu

Sankranti 2025 : ప్రయాణికుల రద్దీ – ప్రవైట్ కాలేజీల బస్సులు వాడుకోండి : సీఎం చంద్రబాబు

Sankranti 2025 : విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు వంటి పట్టణాల్లో బస్సు స్టాండ్లు (RTC bus Stands) కిటకిటలాడుతున్నాయి

  • Author : Sudheer Date : 11-01-2025 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Passengers Rush Used Buse
Passengers Rush Used Buse

సంక్రాంతి (Sankranti ) పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల రద్దీ (Passengers Traffic) గణనీయంగా పెరుగుతోంది. పండుగకు హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు వంటి పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్రంలోని సొంత గ్రామాలకు తరలి వస్తున్నారు. ఈ కారణంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు వంటి పట్టణాల్లో బస్సు స్టాండ్లు (RTC bus Stands) కిటకిటలాడుతున్నాయి. దీంతో బస్సులు (Buses) ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం ప్రభుత్వ తక్షణ చర్యలపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రద్దీని తగ్గించేందుకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను (Buses of private schools and colleges) ఉపయోగించి ప్రయాణికులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, రవాణాశాఖ అధికారులను ప్రత్యేకంగా ఆదేశించి, ఫిట్‌నెస్ ఉన్న ప్రైవేట్ బస్సులను ఎంపిక చేసి రద్దీ ప్రాంతాలకు పంపాలని తెలిపారు.

Green Co Company : ఏపీలో గ్రీన్కో రూ.35వేల కోట్ల పెట్టుబడులు – పవన్ కళ్యాణ్

దీనిద్వారా ప్రజలకు ప్రయాణ సమస్యల నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర రద్దీగా ఉన్న రూట్లను గుర్తించి, ఆ మార్గాల్లో అదనపు బస్సులను నడపాలని సూచించారు. ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిపించడం ద్వారా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పండుగ సమయాల్లో ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపే పండుగ అని, అందరూ సొంత గ్రామాలకు సకాలంలో చేరుకునేలా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పండుగ సీజన్‌లో రోడ్ల రద్దీ తగ్గించడమే కాకుండా, ప్రజలకు ప్రయాణ సౌలభ్యాలను పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, ప్రజలందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకునేలా చేయడంలో ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించబోతోందని ఆయన వెల్లడించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • buses for private colleges
  • CM Chandrababu
  • Passengers Rush
  • Sankranti

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd