MMTS Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్‌లో భారీ వర్షాల సూచన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) 34 MMTS రైలు సర్వీసులను రద్దు చేసింది.
- Author : Balu J
Date : 11-07-2022 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో భారీ వర్షాల సూచన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) 34 MMTS రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, మరియు లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లలో అన్ని MMTS రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్, ఇతర జిల్లాల్లో జూలై 11 ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, GHMC పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ముందుగా హైదరాబాద్‌లోని చాలా చోట్ల జూలై 13 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 27-29, 20-22 డిగ్రీల సెల్సియస్ పరిధిలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. అంచనా ప్రకారం.. రాష్ట్రం మొత్తం గరిష్టంగా 28-31, 20-23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. దీంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.