Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
Rain Alert: అల్పపీడనం నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీద కూడా తీవ్రంగా పడనుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
- By Kavya Krishna Published Date - 11:08 AM, Sat - 5 October 24

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా, రాబోయే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ అల్పపీడనం నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీద కూడా తీవ్రంగా పడనుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Konda Surekha Comments : సురేఖ – సమంత వ్యవహారంలోకి కేతిరెడ్డి
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అక్కడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కురిసే వర్షాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ అల్పపీడనం ప్రభావం కింద వచ్చే ప్రాంతాల్లో ప్రజలు వర్షం వల్ల కలిగే అవాంతరాలకు సిద్ధంగా ఉండాలని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. కేరళ రాష్ట్రంలో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీని ఆధారంగా మలప్పురం నుంచి కన్నూర్ వరకు నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Zakir Naik : అనాథ శరణాలయంలో కార్యక్రమం.. స్టేజీ నుంచి దిగిపోయిన జాకిర్ నాయక్