4 killed : యూపీలో భారీ వర్షాలు.. గోడ కూలి నలుగురు మృతి
యూపీలోని ఇటావాలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటావాలో గురువారం...
- By Prasad Published Date - 11:15 AM, Thu - 22 September 22

యూపీలోని ఇటావాలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటావాలో గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ ఒక భాగం కూలిపోవడంతో నలుగురు మైనర్ పిల్లలు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలుపుతూ రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల సహాయాన్ని అందజేయాలని ఆదేశాలు ఇచ్చామని, గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపారు.
Uttar Pradesh | 4 minors died, 2 injured after a wall collapsed due to heavy rainfall in Etawah
4 children have died. Compensation will be given as per norms: Avnish Rai, Etawah DM pic.twitter.com/el26qwmQQc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 22, 2022
Related News

Floods: ఎందుకీ వరదల ముప్పు..? ఎవరిది తప్పు..?
బుధవారం అరగంట పాటు కుండపోతగా కురిసిన వర్షంతో (Floods) హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతానికి నగరాలు మునిగిపోయే ప్రమాదం దాపురించింది.