Haryana Farmers: ప్రభుత్వంపై రైతు విజయం
రైతుల డిమాండ్లన్నింటినీ హర్యానా ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.6400 చొప్పున కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
- Author : Praveen Aluthuru
Date : 13-06-2023 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
Haryana Farmers: రైతుల డిమాండ్లన్నింటినీ హర్యానా ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.6400 చొప్పున కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే రైతులకు ఇప్పుడు పొద్దుతిరుగుడుపై కనీస మద్దతు ధర (MSP) లభిస్తుంది. అదే సమయంలో జైల్లో ఉన్న రైతులందరినీ కూడా బుధవారం విడుదల చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైతులు కూడా సమ్మె విరమించి సంబరాలు చేసుకుంటున్నారు. హైవేపై రైతులు క్రాకర్స్ కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
రైతు నాయకుడు రాకేష్ టికాయత్ మాట్లాడుతూ.. మా సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎంఎస్‌పీ కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. దేశ ప్రధాని నిర్ణయించిన రేటునే రైతులు అడిగారని రాకేష్ టికాయత్ అన్నారు. ఈ పోరు ప్రధాని, ముఖ్యమంత్రి మధ్యే జరిగింది. ఎంఎస్పీ విషయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రధాని నిర్ణయించిన రేటు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Read More: Kothakota Dayakar Reddy: దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు