Gold- Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు భారీగా తగ్గాయి.
- By Gopichand Published Date - 07:38 AM, Wed - 13 December 23
Gold- Silver Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,910గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (డిసెంబర్ 13, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: 5 School Holidays : నెలాఖరులో 5 వరుస సెలవులు.. వచ్చే నెలలో 6 వరుస సెలవులు
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,060గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,910 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,700 ఉండగా, ముంబైలో రూ.75,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,700 ఉండగా, కోల్కతాలో రూ.75,770గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,800 ఉండగా, కేరళలో రూ.77,700గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,700 ఉండగా, విజయవాడలో రూ.77,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ రెండు బ్యాంకులే బెస్ట్..!
మన భవిష్యత్తుని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడానికి మనమందరం వేర్వేరు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాము.