5 School Holidays : నెలాఖరులో 5 వరుస సెలవులు.. వచ్చే నెలలో 6 వరుస సెలవులు
5 School Holidays : ఈ ఏడాది విద్యార్థులకు పెద్దసంఖ్యలో సెలవులు వచ్చాయి.
- By Pasha Published Date - 07:16 AM, Wed - 13 December 23

5 School Holidays : ఈ ఏడాది విద్యార్థులకు పెద్దసంఖ్యలో సెలవులు వచ్చాయి. ఫెస్టివల్ హాలిడేస్, బంద్‌ల వల్ల సెలవులు ఎక్కువే వచ్చాయి. ఇక ఈ నెల (డిసెంబరు)లో రాబోతున్న ముఖ్యమైన పండుగ క్రిస్మస్. ఈ సందర్భంగా మిషనరీ స్కూళ్లకు వరుసగా ఐదు రోజుల హాలిడేస్(5 School Holidays) ఉన్నాయి. డిసెంబర్ 22 నుంచి 26 వరకు వాటికి క్రిస్మస్ సెలువులు ఉంటాయి. డిసెంబర్ 26న బాక్సింగ్ డే ఉండటంతో.. ఈ రోజున కూడా కొన్ని స్కూల్స్ , కాలేజీలకు సెలవు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. ఇతర స్కూళ్లకు డిసెంబర్ 25న ఒకరోజు హాలిడే సెలవు ఉంటుంది. అయితే డిసెంబర్ 25 సోమవారం రావడం.. డిసెంబర్ 24 ఆదివారం కావడంతో విద్యాసంస్థలకు వరుసగా రెండు రోజుల సెలవులు వస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
వచ్చే నెల (జనవరి)లో ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ ఉన్నాయి. ఈ ఫెస్టివల్స్ అన్నింటికి కలిపి వరుసగా ఆరు రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఏడాది మొత్తం 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవుల్లో కొన్ని సండేలలో కలిసే ఉన్నాయి.