Gold- Silver: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్వల్పంగా పెరిగాయి.
- By Gopichand Published Date - 07:52 AM, Fri - 8 December 23
Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,780గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (డిసెంబర్ 08, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Sammakka Sarakka University : ‘సమ్మక్క సారక్క వర్సిటీ’ బిల్లుకు లోక్సభ అప్రూవల్
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,930గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,780 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,780గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,200 ఉండగా, ముంబైలో రూ.77,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, కోల్కతాలో రూ.77,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,750 ఉండగా, కేరళలో రూ.80,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, విజయవాడలో రూ.80,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ రెండు బ్యాంకులే బెస్ట్..!
మన భవిష్యత్తుని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడానికి మనమందరం వేర్వేరు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాము.