Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : మహిళలకు గుడ్‌న్యూస్. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు దిగివచ్చాయి. భారీగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి రేట్లు ఇవాళ దిగిరావడం కాస్త ఊట కల్పించే విషయమనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు దిగిరావడంతో దేశీయంగానూ రేట్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 10:25 AM, Sun - 29 December 24

Gold Price Today : భారతీయులు, ముఖ్యంగా మహిళలు, బంగారాన్ని ప్రత్యేకంగా ప్రేమిస్తారు. పసిడి ఆభరణాలపై వారి మక్కువ అధికం. కొత్త డిజైన్లు, ప్రత్యేక మోడల్ నగలు మార్కెట్లోకి వచ్చినప్పుడు, వాటిని సొంతం చేసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారానికి గిరాకీ మరింతగా పెరుగుతుంది. బంగారం కొనుగోళ్లు ప్రతి సందర్భంలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించాయి.
అయితే, దేశీయ బంగారం ధరలు కేవలం గిరాకీకి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లు, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరమైన నిర్ణయాలు వంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో జరిగిన మార్పులు దేశీయ ధరలపై ప్రభావం చూపుతాయి.
డిసెంబర్ 29న హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు
గ్లోబల్ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. మూడు రోజుల వరుస పెరుగుదల తర్వాత స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2621 డాలర్ల వద్ద నిలిచింది. అలాగే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 29.42 డాలర్ల వద్ద ఉంది. ఈ ధరలపై రుపాయి మారకం విలువ కూడా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రుపాయి విలువ రూ. 85.458 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి, ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.
22 క్యారెట్లు: 10 గ్రాముల ధర రూ. 150 తగ్గి రూ. 71,350కు చేరింది.
24 క్యారెట్లు: 10 గ్రాముల ధర రూ. 160 తగ్గి రూ. 77,840కు చేరింది.
వెండి ధరలు కూడా తగ్గినవి
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇటీవల లక్ష రూపాయల మార్కును దాటి కలవరపెట్టిన వెండి రేటు, ఇవాళ కిలోకు రూ. 100 తగ్గి రూ. 99,900గా నమోదైంది.
తాజా ధరల వివరాలు
ఈ రేట్లు డిసెంబర్ 29 ఉదయం 7 గంటల వరకే వర్తిస్తాయి. మార్కెట్లలో మధ్యాహ్నానికి ధరల మార్పు సంభవించవచ్చు. ఈ రేట్లలో ట్యాక్సులు, ఇతర ఛార్జీలు కలుపబడలేదు. ప్రాంతాన్ని బట్టి కూడా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
(గమనిక: బంగారం లేదా వెండి కొనుగోలుకు ముందు స్థానిక జువెలర్స్ వద్ద ధరలు ధృవీకరించుకోవడం మంచిది.)
Jawahar babu : ఎంపీడీవో పై దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్